విశాఖ మన్యం చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయితీలోని చెల్లాయి కాఫీ ప్లాంట్ నుంచి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న మిరియాల బస్తాలను చల్లాయి గ్రామస్థులు చాకచాక్యంగా పట్టుకొని చింతపల్లి కాఫీ బోర్డు అధికారులకు అప్పగించారు. ఈ అక్రమ రవాణాలో కాఫీ బోర్డు సిబ్బందిలో ఒకరు, చెల్లాయిలో నివసిస్తున్న మరొకరి హస్తం ఉందని గ్రామస్థులు ఆరోపించారు. తప్పు చేసిన వారిని అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొంతకాలంగా అక్రమ రవాణా జరుగుతుందని... దీనిపై విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని కాఫీ బోర్డ్ రేంజర్ ప్రసాద్ అన్నారు.
ఇవీ చదవండి...ఇల్లు తగులబెట్టిన ఎలుక...రూ. 4 లక్షలు ఆస్తినష్టం..!