ETV Bharat / state

స్టీల్ ప్లాంట్ లేకుంటే విశాఖ నగరమే లేదు : చంద్రబాబు - విశాఖ ఉక్కు పరిశ్రమ

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ లేకపోతే విశాఖ నగరమే లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. విశాఖలో పల్లా శ్రీనివాస్‌ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించిన చంద్రబాబు ఆయనతో దీక్షను విరమింపజేశారు. ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ చంద్రబాబు నిలదీశారు. అందరమూ ఒక్కటై ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

స్టీల్ ప్లాంట్ లేకుంటే విశాఖ నగరమే లేదు : చంద్రబాబు

author img

By

Published : Feb 17, 2021, 6:50 AM IST

స్టీల్‌ ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలో పల్లా శ్రీనివాస్‌ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించిన చంద్రబాబు ఆయనతో దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారని చంద్రబాబు కొనియాడారు.

సీఎంకు చిత్తశుద్ధి ఉంటేే గనులు ఇవ్వాలి...

ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ చంద్రబాబు నిలదీశారు. కమీషన్ ఏజెంట్లలా విశాఖను దోచుకోవాలని చూస్తున్నారా ప్రశ్నించారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే గనులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరమూ ఒక్కటై ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని.. ప్రతిపక్ష పార్టీగా ఉక్కు ఉద్యమానికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేద్దామంటే తాము సిద్ధమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రతి తెలుగువాడి ఇంట్లో చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు. పోర్ట్ బేస్‌లో ఎక్కడా స్టీల్‌ప్లాంట్ లేదని.. విశాఖలోనే ఉందని చంద్రబాబు వివరించారు.

5 లక్షల మందికి ఉపాధి..

5 లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ.. విశాఖ ఉక్కు పరిశ్రమని... ఉక్కు పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు సంస్థ ద్వారా కార్మికులు రూ.33 వేల కోట్ల పన్నులు కట్టారని చంద్రబాబు వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా రూ. వేల కోట్ల పన్నులు కట్టారన్న చంద్రబాబు... వాజ్‌పేయీ హయాంలో బీఈఎఫ్‌ఆర్‌కు వెళ్తే రూ.1,300 కోట్లు ఇచ్చి ఊపిరిపోశారని గుర్తుచేశారు. మళ్ళీ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఉరుకునేది లేదని గట్టిగా చెప్పారు.

ఇవీ చూడండి

: నేడు మూడో దశ పంచాయతీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.