చిలకడ దంపల మాటున గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి బిహార్‌కు తరలిస్తుండగా.. 750 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు అరకులోయ సీఐ వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 85 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు.
సిబ్బందితో కలిసి ఎస్సై జోగారావు.. వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను పట్టుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. విశాఖ నుంచి ఒడిశాలోని మండికి.. అటుపిమ్మట బిహార్‌కు సరుకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల యజమాని సోను కుమార్ ఠాకూర్‌ను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ యాప్‌ల్లో రుణం... ఒత్తిడి తట్టుకోలేక యువతి ఆత్మహత్య