ETV Bharat / state

వాగు ఒడ్డున.. భారీ మొసలి కళేబరం..! - huge crocodile washed ashore in Visakhapatnam

విశాఖ మన్యం బలపం పంచాయతీలోని చెరువూరు వాగులో భారీ మొసలి కళేబరం ప్రత్యక్షమైంది. అయితే..దాని నుంచి దుర్వాసన వస్తుండటంతో వాగు సమీపంలోనే పూడ్చిపెట్టారు గిరిజనులు.

huge crocodile washed ashore in Visakhapatnam
విశాఖ మాన్యంలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ మొసలి
author img

By

Published : Feb 26, 2022, 4:37 PM IST

విశాఖ మన్యంలో భారీ మొసలి కళేబరం కనిపించింది. చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు వాగులో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఆ కళేబరాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారు. ఇది సుమారు 12 అడుగుల పొడవుతోపాటు భారీ దేహంతో ఉంది. ఆ కళేబరాన్ని చూసేందుకు స్థానిక గిరిజనులు ఎగబడ్డారు. అయితే.. కళేబరం నుంచి దుర్వాసన వస్తుండటంతో వారు.. దీన్ని సమీపంలోనే పూడ్చిపెట్టారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉన్న చెరువూరు వాగుపై వంతెనలు లేకపోవడంతో వాగులు దాటుకుంటూ స్థానికులు గ్రామాలకు చేరుకుంటుంటారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వాగులో నీరు తాగేందుకు వెళ్లిన కొందరు గిరిజనులు.. ఈ ముసలిని గుర్తించారు. ఏమైందో తెలియదుగానీ.. వాగు ఒడ్డున అది చనిపోయి ఉంది.

పెద్దవాగు కావడంతో అప్పుడప్పుడు ఇందులో భారీ మొసళ్లుతోపాటు మొసళ్లు పిల్లలు కనిపిస్తున్నట్టు గిరిజనులు చెపుతున్నారు. మన్యంలో వాగుల్లో మొసళ్ల సంచారం ఉందని చెపుతున్నప్పటికీ.. ఇంత పెద్ద పరిమాణంలో మొసలి కనిపించడం తొలిసారి.

ఇదీ చదవండి:

Damaged Roads: అక్కడ అడుగుకో గుంత.. నరకప్రాయంగా రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.