కరోనా కష్టకాలంలో విశాఖలో దాతల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత స్థితిలో ఉన్నవారు కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు. ఇదే కోవలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, విశాఖ రిఫైనరీ.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం రూ. 35 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. చెక్కును జిల్లా కలెక్టర్ వినయ చంద్‌కు అందజేశారు. ఆక్సిజన్ అందక బాధితులు మరణిస్తుండటంతో.. ఈ విరాళాలు ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: 'స్వార్ధ రాజకీయాల కోసం.. దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తారా?'