విశాఖ ఏజెన్సీలో హిందూ ధర్మ ప్రచార యాత్ర ముగిసింది. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర పాడేరు, ఉక్కుర్భ, అడ్డుమండ, హుకుంపేట, సంతబయలు, మఠం, కిండంగి అటవీ ప్రాంతాల్లో పర్యటించారు. పాడేరు మోదకొండమ్మ, మత్స్యదేవుని క్షేత్రం, ఉక్కుర్భ భీమలింగేశ్వర స్వామి, హుకుంపేట , అడ్డుమండ శివాలయాన్ని సందర్శించారు. ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో రుద్రహోమానికి హాజరయ్యారు.
ఆలయ పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఆదివాసీలతో ముచ్చటించారు. మఠం గ్రామంలో.. ఆంధ్ర వనవాసీ కల్యాణాశ్రమ్ సంస్థ నిర్వహిస్తున్న అనాథ బాలల గురుకులాన్ని సందర్శించారు. అక్కడి గిరిజనులకు చీరలు పంపిణీ చేశారు.శనివారంతో హిందూ ధర్మ ప్రచార యాత్ర విశాఖ ఏజెన్సీలో ముగిసింది.
ఇదీ చూడండి: