విశాఖలో ఎల్జీ పాలిమర్స్ హైపవర్ కమిటీ విచారణ రెండో రోజు కొనసాగింది. జీవీఎంసీ సమావేశ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలతో కమిటీ భేటీ అయ్యింది. హైపవర్ కమిటీ విచారణలో 21 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తమకు వైద్య సేవలు అందించాలని..,హెల్త్ కార్డులు ఇచ్చి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని గ్రామస్తులు కమిటీని కోరారు. ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించే వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
హైపవర్ కమిటీని కలిసేందుకు ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన కనకరాజు భార్య వచ్చారు. ఆమెను పోలీసులు లోపలికి అనుమతించలేదు. గంటకుపైగా గేటు వద్ద వేచి చూసిన ఆమె సొమ్మసిల్లి పడిపోయింది.