ETV Bharat / state

రంగుల రాజకీయాలతో... కోర్టు ఆదేశాలు బేఖాతరు - విశాఖ జిల్లా చోడవరం తాజా వార్తలు

హైకోర్టు ఎన్ని మొట్టికాయాలు వేసినా ప్రభుత్వం తన పని తనదేనన్నట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీ రంగులొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. అయినా ఆ తీర్పు ఎక్కడా అమలైన దాఖలాలు కనిపించడం లేదు.

ycp use political colours for gov offices
తీరు మారని వైకాపా కోర్టు ఆదేశాలు బేఖాతరు
author img

By

Published : Mar 13, 2020, 11:57 AM IST

తీరు మారని వైకాపా.. కోర్టు ఆదేశాలు బేఖాతరు

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులేమిటి.. ? వాటిని తుడిచి వేరే రంగులు వేయండి. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ రంగులు పులమొద్దు. వైకాపా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు స్పష్టం చేసిన వ్యాఖ్యలు. అయినప్పటికీ ప్రభుత్వ తీరు మాత్రం మార్చుకోలేదు. హైకోర్టు అదేశాలు ఎక్కడ అమలవుతున్న దాఖలాలు కానరావడం లేదు.

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో 109 పంచాయతీలున్నాయి. వీటిలో సగానికిపైగా ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులే వేశారు. ఇక సచివాలయ భవనాలది ఇదే పరిస్థితి. నియోజకవర్గ కేంద్రమైన చోడవరం పంచాయతీ కార్యాలయానికి వేసిన రంగులు ఇప్పటికీ మార్చకపోవటం అధికార పార్టి మొండి వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. రంగుల మార్పుపై ఓ కార్యదర్శిని ప్రశ్నించగా.. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అదేశాలు రాలేదని చెప్పడం అశ్చర్యాన్ని కలిగించక మానదు.

ఇవీ చూడండి...

అరకు ఘాట్​రోడ్డులో కారు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.