విశాఖలో గెస్ట్ హౌస్‌కు సంబంధించిన ఆ వివరాలేవి?: హైకోర్టు - విశాఖలో స్టేట్ గెస్ట్ హౌజ్‌పై హైకోర్టులో విచారణ వార్తలు
విశాఖలో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి పిటిషన్‌పై ఇరువర్గాలు... హైకోర్టుకు తమ వాదనలు వినిపించాయి. విచారణ చేసిన ధర్మాసనం.. తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది.
![విశాఖలో గెస్ట్ హౌస్‌కు సంబంధించిన ఆ వివరాలేవి?: హైకోర్టు విశాఖలో గెస్ట్ హౌస్‌కు సంబంధించిన ఆ వివరాలేవి: హైకోర్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9148933-649-9148933-1602508838821.jpg?imwidth=3840)
విశాఖలో గెస్ట్ హౌస్‌కు సంబంధించిన ఆ వివరాలేవి: హైకోర్టు
విశాఖలో గెస్ట్‌హౌస్ నిర్మాణంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది. అతిథి గృహం ప్లాన్, ఖర్చు, విస్తీర్ణం వివరాలు ఎందుకు పొందుపర్చలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విశాఖలో నిర్మించే గెస్ట్‌హౌస్ నమూనాలు ఇంకా పూర్తి కాలేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
టెండర్లు పూర్తయ్యాకే పూర్తి వివరాలు చెప్పగలమని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. తీర్పు రిజర్వులో ఉంచిందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.