ప్రమాదకరంగా వాహనాలు నడిపి విలువైన జీవితాలను కోల్పోవద్దని సినీనటుడు శర్వానంద్ అన్నారు. విశాఖ బీచ్ రోడ్లో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు. సాధారణంగా జరిగే 100 ప్రమాదాల్లో సుమారుగా 25 ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ఉంటున్నారని ఆయన అన్నారు. దానికి కారణం మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, హెల్మెట్ ధరించకపోవడమేనని శర్వానంద్ చెప్పారు. కొంతమంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు అందజేసి.. వాహనాలను వేగంగా నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ, ఏసీపీలు శ్రవణ్ కుమార్, హర్షిత చంద్ర ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో 'ప్రొఫెషనల్ స్కిల్స్ ఫర్ జర్నలిస్ట్స్' పుస్తకావిష్కరణ