విశాఖ నగరంలో శనివారం రాత్రి భారీ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో పెద్ద ఎత్తున కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బీచ్ రోడ్డు, రైల్వే స్టేషన్, జ్ఞానాపురం, అక్కయ్యపాలెం, తాటిచెట్ల పాలెం ఇలా నగర ప్రాంతాలతో పాటు.. శివార్లలోని పారిశ్రామిక ప్రాంతం, గాజువాక స్టీల్ ప్లాంట్ టౌన్షిప్, మధురవాడ ప్రాంతాల్లోనూ ఈదురు గాలుల తీవ్ర ప్రభావం చూపించింది.
అకాలంగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. నగరంలోని రహదారులపై నీరు నిలిచిపోవడం, రోడ్లకు అడ్డంగా చెట్లు కూలడం వల్ల వాహనదారుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిన ప్రాంతాల్లో జనం ఇబ్బందులకు గురయ్యారు.
ఇదీ చదవండి:
ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వంగలపూడి అనిత