విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో ప్రధాన జలాశయాలన్ని వరద నీటితో కళకళలాడుతున్నాయి.పెద్దేరు జలాశయం ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద పెరిగితే ప్రధాన స్పిల్ వే గేట్లు ఎత్తి.. నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం, చీడికాడ మండలం కోనాం జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ కారణంగా.. పంట కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: