ఇదీ చదవండి : భారీ వర్షాలతో తప్పిన నీటి కష్టాలు
ఇల్లల్లోకి చేరుతున్న వర్షం నీరు...ఇబ్బందుల్లో ప్రజలు - భారీ వర్షం
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాయకరావుపేటలో భారీ వర్షం
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పాయకరావుపేట నియోజకవర్గంలో గ్రామాలను ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలయమయ్యి, రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికి అందివచ్చిన పంట పొలాల్లో మునిగిపోవటంతో నష్టం తప్పదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట మండలంలో పాల్తేరు, మంగవరం, నామవరం, గ్రామాల్లో వర్షం నీరు పోవటానికి సరైన మార్గాలు లేకు ఇల్లల్లోకి వర్షం నీరు చేరుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : భారీ వర్షాలతో తప్పిన నీటి కష్టాలు