ETV Bharat / state

భారీ వర్షాలు... పొంగుతున్న వాగులు, గెడ్డలు - నర్సీపట్నంలో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్సీపట్నం డివిజన్​లో 60.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్. రాయవరం మండలంలో అత్యధికంగా 116 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.

Heavy rains in anakapalli, narseepatnam sub divisions in vizag district
విశాఖపట్నం జిల్లాలో కురుస్తోన్న వర్షం
author img

By

Published : Oct 12, 2020, 3:30 PM IST

వానల ధాటికి గెడ్డలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఏలేరు కాల్వ వరద ప్రవాహంతో కొప్పాక జాతీయ రహదారి నీట మునిగింది. శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనకాపల్లిలోని భీముని గుమ్మం ఉన్నత పాఠశాల ప్రహరీ గోడపై చెట్టు కూలింది. నూకాంబిక ఆర్చ్ వద్ద నీరు నిలిచిపోయింది. రైవాడ, తాండవ, కళ్యాణలోవ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. కళ్యాణపులోవ జలాశయం రెండుగేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకి వదులుతున్నారు. తాండవ ప్రాజెక్టు రెండుగేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రైవాడ జలాశయం ఒక గేటు ఎత్తారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో...

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గజపతి నగరంలో కాలనీలోకి వరద నీరు చేరటంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇదీ చదవండి:

రాజధాని ప్రధాన పిటిషన్లపై దసరా తర్వాత విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.