పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీరం వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతోన్న అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఆవరించి ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండడం వల్ల... మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: నిండుకుండలా కళ్యాణపులోవ జలాశయం