ETV Bharat / state

నూతన సంవత్సర వేడుకలు... జోరుగా మద్యం విక్రయాలు - విశాఖలో మద్యం విక్రయాలు

ప్రభుత్వ మద్యం దుకాణాలకు నూతన సంవత్సర వేడుకలు మంచి కిక్కునే ఇచ్చాయి. మందుబాబులు గురువారం ఒక్కరోజే సుమారు 12.72 కోట్ల విలువైన మద్యం తాగేశారు.

జోరందుకున్న మద్యం విక్రయాలు
జోరందుకున్న మద్యం విక్రయాలు
author img

By

Published : Jan 2, 2021, 10:33 AM IST

కరోనా కలవరం పూర్తిగా తగ్గకున్నా.. తాము మాత్రం తగ్గేది లేదని మందుబాబులు నిరూపించారు. నూతన సంవత్సర వేడుకలను "ఫుల్లు"గా ఎంజాయ్ చేశారు. విశాఖ జిల్లాలో గురువారం ఒక్కరోజే సుమారు 12.72 కోట్ల రూపాయల విలువైన మద్యం తాగేశారు. డిసెంబర్ 31 అమ్మకాలు... గత ఏడాది మాదిరిగానే జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయని అధికారుల నివేదికలు తెలియజేస్తున్నాయి.

విశాఖ జిల్లాలో 266 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటికి మూడు డిపోల ద్వారా మద్యం సరఫరా జరుగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ దుకాణాలకు భారీగా మద్యం సరఫరా చేశారు నిర్వాహకులు. అనుకున్నట్లుగానే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. డిపో నెంబర్1 పరిధిలో... మద్యం దుకాణాలు పరిధికి సంబంధించి 2 కోట్ల 18 లక్షల 87 వేల రూపాయలు, బార్లలో 2 కోట్ల 55 లక్షల 54 వేల రూపాయలు విక్రయాలు జరగ్గా, డిపో నెంబర్ 2 పరిధిలో 78 మద్యం దుకాణాల్లో 3 కోట్ల 18 లక్షల రూపాయలు, బార్లలో 1,50,00,000 చొప్పున అమ్మకాలు జరిగాయి.

డిపో నెంబర్ 3 పరిధిలో 128 దుకాణాలకు సంబంధించి 3 కోట్లు , బార్లలో లో 30 లక్షల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేకపోవడంతో మద్యం విక్రయాలపై ప్రభావం ఉంటుందని అధికారులు భావించారు. అయితే ఆ ప్రభావం ఎక్కడా కనిపించ లేదని వెల్లడైంది.

ఇదీ చదవండి:

బైక్​పై గంజాయి తరలింపు.. బాలుడు అరెస్ట్, జువైనల్ హోంకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.