విశాఖ జిల్లా కసింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో అమ్మ ఒడి డబ్బులు అడిగినందుకు రూపేష్ అనే విద్యార్థిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డీవీవీ శర్మ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంఈఓ దివాకర్ విచారణ చేపట్టారు. నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపడం తో ప్రధానోపాధ్యాయులు డీవీవీ శర్మను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం