ETV Bharat / state

రోడ్డుపై స్టంట్​లు.. ఎందుకు స్వామీ మీకు ఈ తిప్పలు

Youth doing stunts on bike arrestedin telangana: రోడ్డుపై ప్రమాదకరంగా డ్రైవింగ్​ చేస్తూ.. అడ్డు చెప్పిన వారిని అసభ్య పద జాలంతో దూచించిన ముగ్గురు యువకులను తెలంగాణలోని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్​ ఇచ్చి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Bike riders
బైక్ రైడర్స్
author img

By

Published : Dec 10, 2022, 2:29 PM IST

Youth doing stunts on bike arrested telangana: బైక్​పై విన్యాసాలు చేస్తూ.. తోటి వాహనదారులపై అసభ్య పదజాలంతో కామెట్​ చేస్తున్న ముగ్గురు యువకులను తెలంగాణలోని హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివరాలు ప్రకారం హనుమకొండ జిల్లాలోని చింతగట్టు నుంచి భీమారం ప్రధాన రహదారిలో ముగ్గురు యువకులు బైక్​పై విన్యాసాలు చేస్తూ.. తోటి వాహనదారులను అసభ్య పదజాలంతో కామెంట్స్​ చేస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఇది గమనించిన తోటి వాహనదారుడు ఒకరు వారి వికృత చేష్టలను ఫోన్​లో బంధించి సోషల్​ మీడియాలో పెట్టాడు. దీనిని చూసిన కాకతీయ యూనివర్సిటీ పోలీసులు స్పందించారు. సీఐ దయాకర్​ నేతృత్వంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముగ్గురు యువకులను గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్​ నియమాలు అనుసరించి వారిపై కేసులు పెట్టారు.

తల్లిదండ్రుల సమక్షంలో నిందితులైన సుర రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజుకి కౌన్సిలింగ్​ ఇచ్చారు. ఇలాంటి చర్యలు చేయడం వలన వాహనదారులు ఇబ్బంది పడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. తల్లిదండ్రులు వారి పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని సీఐ దయకర్​ సూచించారు.

బైక్​పై విన్యాసాలు చేస్తున్న యువకులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.