విశాఖ నగరంలో నిబంధనలు అతిక్రమించి చేపలు, మాంసం విక్రయిస్తున్న దుకాణాలపై జీవీఎంసీ ప్రత్యేక స్క్వాడ్ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున నేడు నగరంలో చేపలు, మాంసం అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. ఈక్రమంలో నిబంధనలు అతిక్రమించి మాంసం విక్రయిస్తున్న దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మాంసం, చేపలు, రొయ్యలు, చికెన్ స్వాధీనం చేసుకున్నారు. పలు దుకాణాదారుల నుంచి రూ.44,200 అపరాధ రుసుం వసూలు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను డంపింగ్ యార్డ్‌కు తరలించి గొయ్యి తీసి పూడ్చిపెట్టారు.
ఇదీచదవండి.