ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి గాంచిన అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రప్రభుత్వం తరఫున అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మే 11వరకు జరిగే ఈ జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
ఇవీచదవండి.