రైతులకు పంట పెట్టుబడి నుంచి.. పంట అమ్మే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని.. మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి ఉచిత పంటల బీమాను ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.
ఎప్పటి పంట నష్టం అప్పుడే ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను పటిష్టపరుస్తున్నట్లు వివరించారు. మన రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదన్నారు. వ్యవసాయంలో రాష్టం అగ్రగామిగా ఉందని కేంద్రం ప్రకటించిందని కన్నబాబు అన్నారు.
గ్రామ సచివాలయాల ఉద్యోగుల నిరసనపైనా కన్నబాబు స్పందించారు. వచ్చే జూన్ నెలలోపు వారిని రెగ్యులరైజ్ చేస్తామని.. సీఎం చెప్పినట్లు మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: