విశాఖ జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న మూడు చక్కెర కర్మాగారాలు 2020 - 21వ సంవత్సరానికి గానుగాటకు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు గోవాడ చక్కెర కార్మాగారం ప్రారంభ పూజ జరిపించారు. కర్మాగారం యాజమాన్య సంచాలకులు వి.సన్యాసినాయుడు పాల్గొన్నారు.
ఈ ఏడాది 4.5 లక్షల టన్నుల చెరకును గానుగ పట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సన్యాసినాయుడు తెలిపారు. నేటి నుంచి పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేశామన్నారు. వ్యవసాయాధికారి, పరిపాలనాధికారి, గుర్తింపు యూనియన్ నాయకులు, కర్మాగారం ఉన్నతాధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: