ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు - ఏపీలో గుడ్‌ఫ్రైడే వేడుకలు

గుడ్‌ఫ్రైడే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతిని అందరూ అనుసరించాలని పాస్టర్లు కోరారు.

good Friday celebrations in ap
రాష్ట్రవ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు
author img

By

Published : Apr 2, 2021, 2:34 PM IST

విజయవాడలో..

గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకొని క్రైస్తవులు విజయవాడలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి సహనం, త్యాగం, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించతగినవని పాస్టర్లు ఉద్భోదించారు. కరోనా తిరిగి ప్రబలుతున్నందున కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ... గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు చేశారు.

విశాఖలో..

గుడ్‌ఫ్రైడే సందర్భంగా విశాఖలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. జ్ఞానాపురం రక్షణగిరి కొండపైన ఉన్న చర్చి వద్దకు క్రైస్తవులు భారీగా తరలివెళ్లారు. విశాఖ అగ్రపీఠాధిపతి మల్లవరపు ప్రకాశ్ ఆధ్వర్యంలో శిలువను మోసుకుంటూ కొండపైకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.

ఇదీ చూడండి. గుడ్​ ప్రైడే : త్యాగమూర్తి ఏసు దారి మానవాళికి ఆదర్శమార్గం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.