విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. తూర్పుగోదావరి జిల్లా తొండంగి గ్రామానికి చెందిన పది మంది యువకులు సముద్ర స్నానం చేసేందుకు వెంకట నగరం తీరానికి వచ్చారు. వీరిలో నానాజీ అనే యువకుడు నీటిలో కొట్టుకుపోతుండగా అనిల్(17), రాజు(24)లు రక్షి౦చే౦దుకు ప్రయత్నం చేశారు. భారీ అలలు దూసుకు రావటంతో ఇద్దరూ గల్ల౦తు కాగా.. నానాజీ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై విభీషణరావు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి