దేశ వ్యాప్తంగా 123 కాలేజీలకు యూజీసీ ఇచ్చిన యూనివర్సిటీ హోదా రద్దు చేశారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని గీతం వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ అన్నారు. విశాఖ జిల్లాలోని దొండపర్తి క్యాంపస్లో మీడియా సమావేశం నిర్వహించారు. గీతం డీమ్డ్ వర్సిటీపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎవరూ నమ్మొద్దని కోరారు. విశ్వవిద్యాలయంలో అడ్మిషన్స్ జరిగే సమయంలోనే కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేరుగా విశ్వవిద్యాలయం అని కాకుండా డ్డీమ్డ్ టు బీ యూనివర్సిటీ అని పిలవాలని సూచించిందని తెలిపారు. కానీ.. ఈ ఆదేశాలను కొందరు వక్రీకరిస్తున్నారని శివరామకృష్ణ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
ఇదీచూడండి: