విశాఖ జిల్లా అరకు లోయ మన్యం నుంచి విజయనగరం జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న కోటి రూపాయల విలువైన గంజాయిని అరకు లోయ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ రాజారావు ఆధ్వర్యంలో సిబ్బంది.. ముందస్తు సమాచారంతో అనంతగిరి మండలం డముకువద్ద తనిఖీలు నిర్వహించారు. రెండు వాహనాల్లో తరలిస్తున్న 1410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: వంతెనలు శిథిలం .. ఆందోళనలో వాహన చోదకులు