విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం గుల్లేపల్లిలో గంగాదేవి గావు జాతర మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పూర్వీకుల నుంచి యాదవ కులస్థులు ఈ జాతరను ఐదేళ్లకు ఒకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు రోజులుగా గంగాదేవి తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
జాతరలో తప్పెడు గుళ్ల పోటీలను నిర్వహించారు. భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఆలయం ముందు వేసిన చలువ పందిళ్లకు భక్తులు కరెన్సీ నోట్లు, కొబ్బరి, అరటి గెలలను వేలాడదీశారు. జాతరలో చలువ పందిళ్లకు కట్టిన గెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదీ చదవండి: