విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆందోళనకారులను కలిసి వారి సమస్యను తెలుసుకున్నారు. కొవిడ్ సమయంలో విధులు నిర్వహించిన వైద్య సిబ్బంది విషయంలో సర్కారు ప్రవర్తనపై ఆయన మండిపడ్డారు. విపత్తు కాలంలో ముందుండి సేవలందించిన వారిని ముఖ్యమంత్రి రోడ్డు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించకుండా.. మధ్యలో విధుల నుంచి తొలగించడం సమంజసం కాదన్నారు. బకాయిపడ్డ జీతాలు వారం రోజుల్లోగా చెల్లించి.. కాంట్రాక్టు ముగిసే వరకు వారిని విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారి తరపున భాజపా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ధర్నా విరమించేది లేదు.. అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాం'