ETV Bharat / state

నిందితుడికి దిండు, దుప్పటి - స్టేషన్​లో వీఐపీ మర్యాదలు - సీఐ  సస్పెన్షన్ - BORUGADDA ANIL KUMAR POLICE STATION

రిమాండ్‌ ఖైదీ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు దిండుతో ప్రత్యేకంగా పడక - వీఆర్​కు సీఐ శ్రీనివాసరావు

Borugadda Anil Kumar Police Station CCTV Video Viral
Borugadda Anil Kumar Police Station CCTV Video Viral (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2024, 1:08 PM IST

Updated : Nov 10, 2024, 1:27 PM IST

Police Special Treatment to Borugadda Anil Kumar : ఇటీవల రిమాండ్‌ ఖైదీ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు రాజమహేంద్రవరం కారాగారానికి తరలిస్తూ రెస్టారెంట్‌లో బిర్యానీ పెట్టించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన విషయం సంచలనంగా మారింది.

Borugadda Anil Kumar Police Station CCTV Video Viral : రిమాండ్‌ ఖైదీ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో మర్యాదలు చేయటాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావును వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26 నుంచి 29 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకుని అనిల్‌ కుమార్‌ను స్ధానిక పోలీసులు విచారించారు.

అప్పట్లో అనిల్‌కు పోలీసులు బల్లమీద పడక ఏర్పాటు చేయటం, దిండు ఇవ్వటం, కుర్చీలో కూర్చోబెట్టిన సీసీ ఫుటేజీలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో వెంటనే ఐజీ విచారణకు ఆదేశించారు. ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఇచ్చిన ప్రాధమిక నివేదికను అనుసరించి ఈ విషయంలో సీఐ నిర్లక్ష్యం ఉందని తేల్చి చర్యలకు ఉపక్రమించారు. స్టేషన్‌లో నుంచి ఫుటేజీలు బయటకు వెళ్లటాన్ని తీవ్రంగా పరిగణించారు. దీనికి సీఐ నిర్వాకమే కారణమని గుర్తించి చర్యలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

ఎట్టకేలకు చిక్కిన బోరుగడ్డ అనిల్‌ - ఈనెల 29 వరకు రిమాండ్

వ్యక్తిత్వ హననానికి మారుపేరు ఆ పోస్టులు : సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా సమాజం సిగ్గు పడేలా ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు అదనపు ఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రారంభంలో వ్యంగ్యం, విమర్శలకే పరిమితమైన ఈ పోస్టులు ప్రస్తుతం వ్యక్తిత్వ హననానికి మారుపేరుగా మారాయన్నారు. కొంతమంది కావాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి లాంటి ప్రముఖులే కాక మహిళలను, పిల్లలపై సైతం సామాజిక మాధ్యమాల్లో అగౌరవపరుస్తున్నారని రమణమూర్తి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల మీద ప్రత్యేక దృష్టి సారించి, కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుధారాణి, కళ్ళం రవికృష్ణా రెడ్డి మీద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. సుధారాణి మీద ఇతర జిల్లాల్లో కలిపి మెుత్తం 9 కేసులు ఉన్నాయన్నారు. రవికృష్ణారెడ్డి మీద రౌడీషీట్​ నమోదై ఉందన్నారు.

నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదు

Last Updated : Nov 10, 2024, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.