విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం మారుమూల మద్దిగరువు సంతలో మావోయిస్టు మిలీషియా సభ్యుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు పోలీసు హెచ్చరికలతో వెలిశాయి. మావోయిస్టులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించే మిలీషియా సభ్యులను పోలీసులు గుర్తించి హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టు బూటకపు మాటలు విని వారికి సహకరించొద్దు.. నమ్ముకున్న కుటుంబంతో హాయిగా బతకండి... మన్యం అభివృద్ధికి సహకరించండంటూ.. ఫ్లెక్సీల్లో మిలీషియా సభ్యులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో జంతురాయ్లో మావోల తిరుగుబాటు నేపథ్యంలో దాడులను అరికట్టేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: