విశాఖ జిల్లా అరకులోయ మండలంలోని రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన బాలికలపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా.. బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేయటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికలు బహిర్భూమికి వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన రేగ గ్రామానికి చెందిన యువకులు అరకులోయలో జరుగుతున్న జాతరకు వెళ్దామని చెప్పి వారిని వాహనంలోకి ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి అరకులోయ చేరుకుని జాతర ఈ రోజు లేదని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో జనంగుడ గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి బాలికలను తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలికల ఆర్తనాదాలు విని అటుగా వెళ్తున్న వారు అక్కడికి చేరుకోగా నిందితులు పారిపోయారన్నారు. బాలికల వివరాలు తెలుసుకుని సోమవారం రాత్రి గ్రామానికి తీసుకువచ్చి తమకు అప్పగించారన్నారు. మరో వైపు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా నాయకులు పీయస్ ఎదుట బాధిత కుటుంబీకులతో మంగళవారం ఆందోళన చేశారు. ఘటనాస్థలికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. నిందితులు ఐదుగురు మేజర్లేనని సీఐ ఫైడయ్య తెలిపారు.
ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం - raped attempt on womens in ap
మాయమాటలతో నమ్మించి ఇద్దరి బాలికలపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇవీ చదవండి