విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గొట్లం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడు విశాఖ కేజీహెచ్‌లో కోపరేటివ్ సొసైటీలో ఉద్యోగి అని తెలిపారు. బాధితుడు విధులకు హాజరయ్యేందుకు గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తుండేవాడని వివరించారు. ఈ క్రమంలోనే కరోనా సోకి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభనతో మరింత అప్రమత్తం