ETV Bharat / state

విశాఖ మన్యంలో తొలి కేసు... చింతపల్లిలో మహిళకు పాజిటివ్ - విశాఖ మన్యంలో కరోనా కేసు వార్తలు

రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాలకూ పాకుతోంది. విశాఖ మన్యం చింతపల్లిలో తొలి కరోనా కేసు నమోదైంది. పాజిటివ్​గా తేలిన మహిళను విశాఖపట్నం తరలించారు.

first corona case in vizag agency chinthapalli village
విశాఖ మన్యంలో తొలి కేసు
author img

By

Published : Jun 20, 2020, 7:11 PM IST

విశాఖ మన్యంలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. చింతపల్లిలో ఓ మహిళకు పాజిటివ్ నిర్ధరణ కావటంతో విశాఖపట్నం తరలించారు. కొవిడ్ కేసుతో పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన మహిళ ప్రాథమిక కాంటాక్ట్స్​ గురించి ఆరా తీస్తున్నారు. ముగ్గురు అనుమానితులను పరీక్షల కోసం నర్సీపట్నం పంపించారు. చింతపల్లిని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

ఇవీ చదవండి...

కరోనా బాధితులు పద్మావతి నిలయానికి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.