విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ క్వార్టర్స్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కారును తగలబెట్టారు. ఆర్టీసీ డీఎం. రమేష్ వాహనానికి అర్థరాత్రి 2 గంటలకు దుండగులు నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేలోపే ముందుభాగం పూర్తిగా కాలిపోయింది. ఇటీవల డీఎంకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వ్యక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
