ETV Bharat / state

Fire Accident In Narsipatnam: నర్సీపట్నంలో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన సామగ్రి - ఫాల్గాట్​ కూడలిలో అగ్ని ప్రమాదం

Fire Accident In Narsipatnam: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఫాల్గాట్​ సమీపంలోని దుకాణంలో జరిగిన ఈ ప్రమాదంలో బ్యాగ్​లు, ఇతర ప్లాస్టిక్ సామగ్రి కాలి బూడిదయ్యాయి.

Fire Accident In Narsipatnam
నర్సీపట్నలో అగ్నిప్రమాదం
author img

By

Published : Dec 11, 2021, 9:50 AM IST

నర్సీపట్నలో అగ్నిప్రమాదం

Fire Accident In Narsipatnam: విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలోని ఫాల్గాట్ కూడలి సమీపంలో స్కూల్​కు సంబంధించిన వస్తువులు విక్రయించే దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాగ్​లతో పాటు ప్లాస్టిక్ సామగ్రి కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ అగ్నిప్రమాదాన్ని లంబసింగి వెళ్తున్న కొంతమంది యువకులు గుర్తించారు. షాప్ మీద ఉన్న సెల్​ఫోన్ నంబర్​ ఆధారంగా యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అక్కడికి యజమాని పరుగున వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఇదీ చూడండి:

పెనువిషాదం : కృష్ణా నదిలో మునిగి...ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.