విశాఖ జిల్లా గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. కర్మాగారంలో ఉన్న చెరకుపిప్పికి మంటలు అంటుకుని ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు అన్ సీజన్ కావటం వల్ల వచ్చే సీజన్ కోసం యంత్రాలను సరిచేసే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పిప్పికి దరి బెల్టు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. వెల్డింగ్ చేసే సమయంలో చెరకు పిప్పికి నిప్పురవ్వలు అంటుకుని రెండున్నర టన్నుల పిప్పి కాలిపోయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కార్మిక వర్గాలు చెప్తున్నాయి. అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపుచేశాయి.
ఇవీ చదవండి..