విశాఖ పూర్ణామార్కెట్లోని పూసల సత్యనారాయణ ఫొటో ఫ్రేమ్ వర్క్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. పక్కన ఉన్న షాపులకు నిప్పంటుకోకుండా మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణంలోని సుమారు మూడు లక్షల రూపాయలు విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యిందని షాపు యజమాని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో జోరువాన.. ప్రజలకు కాస్త ఉపశమనం