విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని హోటల్, కిరాణ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయి. హోటల్లో టీ చేస్తుండగా గ్యాస్ నుంచి మంటలు ఎగిసిపడడంతో అంతా బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో హోటల్‌తో పాటు పక్కనే ఉన్న కిరాణ దుకాణం పూర్తిగా కాలిపోయింది.
కిరాణ దుకాణంలోని పలు విద్యుత్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. వీటితోపాటు కొన్ని ముఖ్యమైన పత్రాలు మంటల్లో బూడిద అయిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు యజమానులు తెలిపారు.
ఇదీ చదవండి: