జీవో నెంబర్ 3 రద్దును వ్యతిరేకిస్తూ... సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతూ.. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిని అరకులోయ ఎంపీ గొడ్డేటి మాధవి కలిశారు.
జీవో 3 రద్దు వల్ల అనేక మంది గిరిజనులు నష్టపోయారని వ్యాఖ్యనించారు. ఈ అంశంపై సమగ్ర నివేదికను ఆమె ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.