ETV Bharat / state

పాడేరు ఆసుపత్రిలో వైద్యుడిపై దాడి..సిబ్బంది ఆందోళన - paderu

విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిపై రోగి బంధువులు దాడి చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. నిందుతులను వెంటనే శిక్షించాలని ఆసుపత్రి సిబ్బంది ఆందోళన నిర్వహించారు.

పాడేరు ఆసుపత్రిలో వైద్యుడిపై దాడి దృశ్యాలు లభ్యం
author img

By

Published : Oct 1, 2019, 6:01 PM IST

పాడేరు ఆసుపత్రిలో వైద్యుడిపై దాడి..సిబ్బంది ఆందోళన

విశాఖ మన్యం పాడేరు ఆసుపత్రిలో... వైద్యునిపై రోగి బంధువులు దాడికి నిరసనగా వైద్య సేవలు నిలిపేశారు. నిందితునిపై చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్‌ చేశారు. భద్రత కల్పించేంతవరకూ రోగులకు వైద్యం అందించలేమని స్పష్టం చేశారు. అప్పటికే ఆసుపత్రిలో చేరిన రోగులకు చికిత్స అందిస్తుండగా... మరో రోగి వచ్చారని, పది నిమిషాలు ఆగాలని చెప్పిన వెంటనే ఆ రోగి బంధువు దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నారని వైద్యులు తెలిపారు. తొలుత వైద్యుడు నెట్టడం వల్లనే గొడవపడాల్సి వచ్చిందని రోగి బంధువు చెబుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ దృశ్యాలు పరిశీలిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీన్ని మెడికల్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తామని జిల్లా స్థాయి అధికారులు తెలిపారు.
.

ఇవీ చూడండి-ఆడపిల్ల పుట్టిందని చంపేశాడు!

Intro:ap_tpg_82_1_ammavarikipujalu_ab_ap10162

Body:దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు . కొవ్వలి పోతునూరు దెందులూరు గోపన్నపాలెం తదితర గ్రామాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించారు. అనంతరం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారి తో పాటు పెద్దింట్లమ్మ మహాలక్ష్మీ అమ్మవారికి అలంకారం చేసి పూజలు చేశారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.