ETV Bharat / state

మర్లగుమ్మి సాగునీటి కాలువలో శ్రమదానం చేసిన రైతులు

విశాఖ జిల్లా కోనాం జలాశయం పరిధిలోని మర్లగుమ్మి సాగునీటి కాలువలో తుప్పలు, పూడిక తొలగింపునకు దిబ్బపాలెం రైతులు శ్రమదానం చేశారు. కాలువ చక్కగా అభివృద్ధి చేశారు. పొలాలకు సాగునీటిని మళ్లించారు.

Farmers working hard in the Marlagummi irrigation canal
మర్లగుమ్మి సాగునీటి కాలువలో శ్రమదానం చేసిన రైతులు
author img

By

Published : Oct 30, 2020, 3:12 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండల కోనాం జలాశయం పరిధిలోని మర్లగుమ్మి సాగునీటి కాలువ పాదు తుప్పలు దట్టంగా అలుముకున్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభంలో గతంలో ఆరు కిలోమీటర్ల మేరకు ఆయకట్టు రైతులు శ్రమదానం చేశారు. మళ్లీ మర్లగుమ్మి కాలువ ప్రారంభలో ఇటీవల వర్షాలకు పాదు తుప్పలు పెరిగిపోయాయి. ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో ఉంది. సాగునీటికి ఇబ్బందులు రాకుండా రైతులు ముందుగా స్పందించి...సమిష్టిగా కదిలారు. మర్లగుమ్మి కాలువ నీటి సంఘం మాజీ అధ్యక్షుడు జొన్నా మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో దిబ్బపాలెం గ్రామానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున శ్రమదానం చేశారు. కాలువలో దట్టంగా పేరుకుపోయిన పాదు తుప్పలను తొలగించారు. కాలువ ఎంతో చక్కగా శుభ్రం చేసుకున్నారు. పొలాలకు సాగునీటిని మళ్లించుకున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర భద్రత కమిషన్‌ ఛైర్మన్‌గా హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.