ETV Bharat / state

విత్తన కేంద్రాల వద్ద కర్షకుల పడిగాపులు - seeds

విశాఖపట్నం జిల్లా రైతులు విత్తనాల కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం రాయితీ విత్తనాలను అరకొరగా సరఫరా చేస్తోందని ఆందోళన చేపట్టారు. ముందస్తు అంచనాలు పంపినా.. విత్తనాలు తక్కువగా వచ్చాయంటున్న అధికారులు రెండు, మూడు రోజుల్లో కొరత తీరుస్తామని హామీ ఇస్తున్నారు.

విత్తన కేంద్రాల వద్ద కర్షకుని పడిగాపులు
author img

By

Published : Jun 25, 2019, 9:16 PM IST

విత్తన కేంద్రాల వద్ద కర్షకుని పడిగాపులు
ఆరుగాలం శ్రమించి దుక్కులు సిద్ధం చేసిన రైతులకు విత్తనాలు సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ అధికారులు విఫలం అయ్యారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట వ్యవసాయశాఖ పరిధిలో నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, నాతవరం మండలాల పరిధిలో సుమారు 14వేల హెక్టార్లలో వరి సాగు చేసేందుకు రైతులను సమాయత్తం అవుతున్నారు. ఇందుకుగాను 25 వేల కింట్వాళ్ల వరి విత్తనాలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయినా... 1400 కింట్వాలు మాత్రమే గోదాములకు వచ్చాయి. ఇవి ఏ మాత్రం సరిపోవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతలు విత్తనాల కోసం ఎండకు ఎండి, వానకు తడుస్తూ వ్యవసాయశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సిఫార్సు ఉన్న వారికే విత్తనాలు సరఫరా చేస్తున్నారని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తాజాగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. రోజుల తరబడి విత్తనాల కోసం పనులు మానుకుని తిరుగుతున్నామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. విశాఖ ప్రాంతీయ వ్యవసాయశాఖ అధికారి నాగపద్మరావు మాట్లాడుతూ..ఆర్.జె.ఎల్ రకం విత్తనాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, అవి ప్రస్తుతం గోదాంలో లేవని వెల్లడించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Intro:Ap_Rjy_81_25_BusAccident_Thossipudi_AVB_C14

() ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణముగా ఒక నిండి ప్రాణం బలి అయ్యి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి లో చోటు చెసుకుంది
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం అనపర్తి నుంచి రామచంద్రపురం వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ బిక్కవోలు మండలం తొస్సిపూడిగ్రామశివారు సాయితేజ రైసుమిల్లు సమీపంలో కొమరిపాలెం వైపు వెళ్తున్న కారును ఢీకొని అనంతరం ఎదురుగ వస్తున్న రెండు బైకులను ఢీకొట్టింది ఈ ఘటనలో తొస్సిపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ (20) అనే యువకుడు ఆక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు వ్యక్తులకు తీవ్రగాయాలు అవ్వగా మరొక 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి అయిదుగురు క్షతగాత్రులను అనపర్తి వైద్యశాలకు తరలించగా ,స్వల్ప గాయాలు అయిన ప్రయాణీకులు వేరొక వాహనాలపై వారి ఇళ్లకు చేరుకున్నారు . ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన చికిత్సకోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలిస్తున్నట్టు వైద్యులు తెలిపారు . అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అనపర్తి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అనపర్తి సి ఐ ఎన్ .వి.భాస్కరరావు అన్నారు

Byte ఎన్ .వి.భాస్కరరావు, సిఐ. అనపర్తి
Body:Ap_Rjy_81_25_BusAccident_Thossipudi_AVB_C14Conclusion:Ap_Rjy_81_25_BusAccident_Thossipudi_AVB_C14
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.