విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఖరీఫ్ వరినాట్లకి ఇటీవల దిగువ, ఎగువ కాలువలకు 150 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. జలాశయ దిగువ ఆయకట్టులోని మర్లగుమ్మి సాగునీటి కాలువలో మొక్కలు పేరుకుపోయి పొలాలకు నీరు పారడం లేదు. దీంతో వరినాట్లు వేయలేదు. కాలువనీటి సంఘ అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో దిబ్బపాలెం, బైలపూడి, అడివి అగ్రహారం, వింటిపాలెం, జైతవరం గ్రామాలకు చెందిన రైతులు ఆరు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న మర్లగుమ్మి సాగునీటి కాలువలో వారంరోజులుగా పూడిక తీశారు. అనంతరం జలాశయం నుంచి విడుదలవుతున్న సాగునీటిని పొలాలకు మళ్లించుకున్నారు. అధికారులు సాగునీటి విడుదలకు ముందు పూడిక తీయక పోవడంతో ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
అధికారుల తీరుతో విసిగిపోయారు.. రైతులే కాలువలో దిగారు!? - dredging the canal
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని చూడలేదు అక్కడి రైతులు. వారే స్వయంగా కాలువలోకి దిగి పూడిక తీసుకున్నారు. పొలాలకు సాగునీటిని మళ్లించుకున్నారు.
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఖరీఫ్ వరినాట్లకి ఇటీవల దిగువ, ఎగువ కాలువలకు 150 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. జలాశయ దిగువ ఆయకట్టులోని మర్లగుమ్మి సాగునీటి కాలువలో మొక్కలు పేరుకుపోయి పొలాలకు నీరు పారడం లేదు. దీంతో వరినాట్లు వేయలేదు. కాలువనీటి సంఘ అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో దిబ్బపాలెం, బైలపూడి, అడివి అగ్రహారం, వింటిపాలెం, జైతవరం గ్రామాలకు చెందిన రైతులు ఆరు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న మర్లగుమ్మి సాగునీటి కాలువలో వారంరోజులుగా పూడిక తీశారు. అనంతరం జలాశయం నుంచి విడుదలవుతున్న సాగునీటిని పొలాలకు మళ్లించుకున్నారు. అధికారులు సాగునీటి విడుదలకు ముందు పూడిక తీయక పోవడంతో ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు.
వరుణుడు కరుణ చూపాలని ఏడుపులు
చిత్తూరు జిల్లా శాంతి పురం మండలం లో వర్షం కోసం మహిళ లు బోరున విలపించారు ఈ వింత ఆచారం మండల పరిధి ఏడో మైలు గ్రామం లో పాటించిన వైనం ఇది.తీవ్రమైన వర్షాభావO వల్ల నీటి సమస్య ఏర్పడింది
వర్షం కోసం పూజలు చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకొని శనివారం రాత్రే సమీప చెరువు కు చేరుకున్నారు కప్పలకు పూజలు చేసారు అంబలి పోసారు మహిళల రైతులు చిన్నారులు ఆకాశం వైపు చూస్తూ బోరున ఏడ్చారు ఇలా చేయడం వల్ల దేవుడు దయ చూపి వర్షం కురుస్తుంది అని రైతులు తెలిపారు
8008574585Body:HgfConclusion:Kjh