విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం నీటిని ఖరీఫ్ పంటలకు విడుదల చేసినా.... ఆ ఆనందం రైతుల్లో నిలవలేదు. జలాశయానికి సంబంధించి కుడి కాలువ పరిధిలో 18 వేల ఎకరాలు సాగులో ఉన్నాయి. కాలువ వెంట వెదురు పల్లి అక్విడెక్ట్ ఆర్.కొత్తూరు వద్ద రెండు చోట్ల మరమ్మతు పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ఆ పనులు ఆగస్టు 5 నాటికి పూర్తి కావాలని జలవనరుల శాఖ అధికారి రాజేంద్ర కుమార్ ఆదేశించారు.
కానీ.. ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవటంతో ఆయకట్ట దారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎడమకాలువ నుంచి మాత్రమే నీరు విడుదల అవుతోందని... ఎదిగిన నారుతో నాట్లు వేయకుండా ఎదురుచూస్తున్నామని కొత్తగూడెంకు చెందిన ఆయకట్టు పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో జాప్యం జరిగిందని రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్ర కుమార్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: