ETV Bharat / state

మాస్కుల తయారీ... మహిళలకు ఉపాధి

కరోనా కట్టడిలో భాగంగా.. విశాఖ జిల్లా ఎలమంచిలిలో ప్రభుత్వ సహకారంతో మాస్కులు తయారీకి పూనుకున్నారు స్థానిక మహిళలు. ప్రతి కుటుంబానికి 3 మాస్కులు చొప్పున పంపిణీ చేస్తున్నారు.

Employment for women through the manufacture of masks
మహిళకు ఉపాధి కల్పిస్తున్న మాస్కుల తయారీ
author img

By

Published : Apr 22, 2020, 3:07 PM IST

మహిళకు ఉపాధి కల్పిస్తున్న మాస్కుల తయారీ

విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో మాస్కులు తయారీకి మహిళలు శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం మున్సిపాలిటీ పరిధిలోని ఫ్యాషన్ టెక్నాలజీ కేంద్రంలో ప్రభుత్వం మహిళల ద్వారా మాస్కులను తయారు చేయిస్తోంది. పట్టణంలోని మహిళలకు వీటి తయారీ పై శిక్షణ ఇచ్చారు. అత్యాధునిక మిషన్లతో శరవేగంగా వీటిని సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అవసరమైన ముడిసరుకును ప్రభుత్వం సరఫరా చేస్తోంది.

ఇక్కడ తయారైన మాస్లును జిల్లాలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలకు ముందుగా సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కలిపి రోజుకి పది వేలకు పైగా మాస్క్ తయారు చేస్తున్నారు. వీటిని స్టెరిలైజేషన్ చేసి అధికారులకు అప్పగిస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన జాబితా ప్రకారం ప్రతి ఇంటికి మూడు మాస్కులు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఒక మాస్క్​ తయారు చేయడానికి రెండున్నర రూపాయల చొప్పున మహిళలకు ఇస్తున్నారు.

ఇవీ చదవండి:

గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.