విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు సంతలు లేక, నిత్యావసర కూరగాయలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన గ్రామ ఉద్యోగులు నడుం బిగించారు. పెదబయలు మండలం కీముడుపల్లికి చెందిన గండేరు నిరీక్షణరావు గ్రామ పరిస్థితులను ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లారు. రంగారావు, రామ్మూర్తి, సింహాచలం అనే ముగ్గురు ఉద్యోగులు 250 మంది గిరిజనుల ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితులలో తమకు సాయం అందించిన ఉద్యోగులను గ్రామస్తులు కొనియాడారు.
ఇదీ చదవండి: నింగినంటిన 'నిత్యావసరం': కొనేదెలా..?