లంచం తీసుకుంటూ ఏపీఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్. వి. రమణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విశాఖ జిల్లా చిట్టివలస సెక్షన్ ఏఈ రమణ సంగివలసలో ఓ అపార్ట్మెంట్కు 6 కొత్త విద్యుత్ మీటర్లకు కనెక్షన్ ఇచ్చేందుకు 70 వేలు లంచం డిమాండ్ చేసారు. లంచం ఇచ్చేందుకు ఇష్టపడని అపార్టుమెంట్ యజమాని ఎం.రామారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
లంచాధికారిని పట్టుకునేందుకు వలపన్నిన ఏసీబీ.. ఇవాళ చిట్టివలస విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రంగరాజు అధ్వర్యంలో దాడి చేశారు. బాధితుడు రామారావు నుండి 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ రమణను పట్టుకున్నారు. డబ్బుతో పాటు సంబంధిత రికార్డును అధికారులు స్వాధీనంచేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం!