విశాఖ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2 వెల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ప్రత్యేక చొరవ చూపాలని సిబ్బందికి సూచించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎలాంటి చిన్న సంఘటన జరిగిన వెంటనే మొబైల్ టీం స్థానిక పోలీస్ స్టేషన్ సెల్‌కి సమాచారం అందించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ సిబ్బంది చొపవ చూపాలని వివరించారు.
ఇదీ చదవండి: మంత్రుల నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్వీకరణ