విశాఖ శారదా పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. శుక్రవారం రాజశ్యామల అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. పద్మాసనంపై ఆసీనులైన భక్తులకు లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహిస్తున్నట్లు అమ్మవారి అవతారాన్ని విశేషంగా అలంకరించారు. సాక్షాత్తు పరమశివుడే అన్నపూర్ణాదేవిని ఆహారం అర్ధిస్తున్న చిత్రాన్ని అవతారంలో ఉంచారు. మహాలక్ష్మి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హారతులిచ్చి, ప్రత్యేక పూజలు చేశారు.
ఇవీ చూడండి...