లాక్ డౌన్ కారణంగా సింహాద్రి అప్పన్న ఆలయానికి భక్తులు రాకపోవడంతో ఆదాయం రావడం లేదు. ఈ సమయంలోనే స్వామివారి ప్రధాన ఉత్సవాలు, చందనోత్సవం, గంధం అమావాస్య, కళ్యాణం వంటివి ఏకాంతంగానే అర్చక స్వాములు నిర్వహించారు. చందన యాత్ర ఒక్క రోజునే గత ఏడాది నాలుగు కోట్ల రూపాయల ఆదాయం స్వామివారి ఖజానాకు చేరింది. లాక్ డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే స్వామి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి లాక్డౌన్లో వలస కూలీల మరణ గాథ!